కర్నూలు జిల్లాలో వరద బాధితులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు కురిపించారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. అలాగే, ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున వంట సరుకులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టాన్ని స్పష్టంగా అంచనా వేయాలని, బాధితులు చెప్పేది పూర్తిగా తెలుసుకోవాలని అధికారులకు కూడా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.