బోటు ప్రమాద ప్రాంతంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను ఏసీ సీఎం వైఎస్ జగన్ పర్యవేక్షించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన ముఖ్యమంత్రి బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద ఘటనుంచి బయటపడి చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు.