జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.