ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ తొమ్మిది నెలల పాలనలో రక్తం పీల్చడం తప్ప చేసింది శూన్యం అని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన వాటికి మించిన అరాచకాలు వైసీపీ చేస్తోందన్నారు.