HOME » VIDEOS » National

Video : ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

ఆంధ్రప్రదేశ్23:24 PM January 20, 2020

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఈ ఒక్క రోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు వారిని కూర్చోవాలని సీఎం జగన్ కోరారు. అనంతరం పోడియం వద్ద గందరగోళం చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. జగన్ విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ నిరసనల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు సభలో బిల్లు కాపీలను చించివేశారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకుని వెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో కూడా టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడు కూడా సభ నుంచి బయటకు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ లాబీలో బైఠాయించారు.

webtech_news18

Top Stories