ఎన్నికల వేళ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో పరస్పరం కొట్టుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు అదుపుచేసేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.