ఏపీలో పోలింగ్ వేళ భారీగా డబ్బు పంచారు అభ్యర్థులు. విజయవాడలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచారు. వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ చేరుకొని వారిని అడ్డుకున్నారు. దాంతో పోలింగ్ స్టేషన్ల నుంచి టీడీపీ నేతలు వెళ్లిపోయారు. ఐతే ఓటర్లకు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.