ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని సినీనటుడు మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. తన బంధువని పార్టీలో చేరలేదని..ఏపీ ప్రజలకు మంచి చేస్తాడన్న ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు. తనకు పదవులు ముఖ్యంకాదని..జగన్ గెలుపే ముఖ్యమని స్పష్టంచేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు మోహన్ బాబు.