ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేక పోయిన వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు.