అమరావతి రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఏపీ సచివాలయంలో సమావేశానికి వెళుతున్న సీఎం జగన్కు తమ నిరసన వ్యక్తం చేసిన అమరావతి ప్రాంత రైతులు... తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లు రువ్వారు. ఆయన సెక్యూరిటీపై కూడా కొందరు దాడి చేశారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగే ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు.