ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు. సిటీలోని బెంజ్‌సర్కిల్‌లో ఆదివారం ఉదయం మానవహారం నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సేవ్ అమరావతి నినాదంతో హైస్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.