Lok Sabha Elections 2019: నిన్నటి వరకూ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను తన మాటలతో వాయించేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఎన్నికలు ముగియడంతో పియానో వాయిస్తూ సేద తీరారు. సభలు, సమావేశాలు, సంప్రదింపులు, రాజకీయ వ్యూహాలతో కూడిన బిజీ లైఫ్ నుంచి ఎన్నికల ఫలితాలకు ముందు దొరికిన కాస్త విరామంలో విశ్రాంతి తీసుకునేందుకు ఠాగూర్ పాటల నుంచి ఓ ట్యూన్‌ను పియానోపై వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన మమత.. ‘ఈ పాటను మాత, మాతృభూమి, ప్రజలకు అంకితం చేస్తున్నా’ అని కామెంట్ పెట్టారు.