కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి నిరాకరించిన పోలీసులు, రోడ్డుపైనే అడ్డుకున్నారు. ఈ సమయంలో తనపై అక్కడి పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని, మెడపై చేయి వేసి పక్కకు నెట్టివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటించిన తనపై దాడి చేశారని ప్రియాంక ఆరోపించారు.