Anti-CAA Protest in Chennai : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా... చెన్నైలోని అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు ప్రజలు. ఐతే... వాళ్లను నిలువరించే క్రమంలో ఇద్దరు మహిళా పోలీసులకు గాయాలు అవ్వడంతో... ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఛార్జ్‌లో చాలా మంది గాయాలపాలయ్యారు. పోలీసుల చర్యతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. తమిళనాడులోని చాలా నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు సాగాయి. వాటిలో ఎక్కువగా ముస్లింలు పాల్గొన్నారు. ముఖ్యంగా అలందూర్, మౌంట్ రోడ్, తంబారంలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. మధురై, కోయంబత్తూర్, తిరుచ్చి జిల్లాలు ఆందోళనలతో హోరెత్తాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు నిరసన గళం వినిపించారు స్థానికులు.