దసరా వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని అమృత్సర్లో రైలు ఢీకొని50 మందికి పైగా చనిపోయారు. అమృత్సర్లోని బోడా పాటక్ ప్రాంతంలో దసరా సందర్భంగా రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రావణుడి దిష్టిబొమ్మలో పెద్ద ఎత్తున టపాసులను అమర్చారు. భారీగా టపాసులు పేలడంతో ఆ నిప్పు రవ్వలు వచ్చి అక్కడున్న వారిపై పడ్డాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ క్రమంలో గ్రౌండ్ పక్కనే ఉన్న రైలు పట్టాల మీదకు పరుగులు పెట్టారు. ఆ సమయంలో అటుగా రైలు వచ్చింది. కానీ, వారు రైలును చూసుకుని తప్పుకొనే లోపే ప్రమాదం జరిగిపోయింది. ఇప్పటి వరకు సుమారు 60 మంది చనిపోయినట్టు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.