HOME » VIDEOS » National

Video : మాయావతి మునిగిపోయే నావలో ఉన్నారు : ప్రధాని నరేంద్ర మోదీ

ఉత్తరప్రదేశ్‌లో మహా ఘట్ బంధన్‌కే ముస్లింలు ఓట్లు వెయ్యాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఓట్లు చీలిపోకూడదని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఇదే విషయంపై న్యూస్18 గ్రూప్... ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన ఇంటర్వ్యూలో న్యూస్18 ప్రతినిధి ప్రధాని అభిప్రాయం కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం మాయావతికి అలవాటే అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుతం మాయావతి ఓటమి అంచుల్లో ఉందన్నారు. ముస్లింలు ప్రత్యేకంగా తనకు ఓటు వెయ్యాలని మాయావతి కోరుతున్నారని అన్న మోదీ... ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాల్సి ఉందన్నారు. మాయావతి గురించి తాను ఆందోళన చెందట్లేదన్నారు మోదీ. మునిగిపోయే పడవలో ఆమె కూడా ఉన్నారన్న మోదీ... మద్దతు కోసం ముస్లింలవైపు చూస్తున్నారని సైటెర్ వేశారు. లౌకిక వాదులు మౌనంగా ఉండటంపై తాను ఆందోళన చెందుతున్నానన్న మోదీ... ఎవరైనా హిందువులకు అలాంటి అభ్యర్థన చేశారా అని ప్రశ్నించారు. మాయావతి లాంటి వాళ్లు చేసే ఇలాంటి వ్యాఖ్యల్ని తిప్పికొట్టాలన్నారు. అవార్డ్ వాపసీ గ్యాంగ్ తిరిగి వచ్చిందన్న మోదీ... సంతకాల సేకరణ మొదలవుతుందన్నారు. ఆ బృందం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించిన మోదీ... దేశ సమైక్యతకు అది ప్రమాదమన్నారు. ఇలాంటి చర్యల్ని మీడియా ప్రజల ముందుకు తేవాలని కోరారు. లౌకికత్వం పేరుతో మతతత్వాన్ని ప్రేరేపించే ఇలాంటి వారితో దేశానికి అతి పెద్ద ప్రమాదం అన్నారు మోదీ. రాజకీయాల్లో నెగ్గుకొచ్చేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారన్న మోదీ... ఓట్లు రాబట్టుకునేందుకు ఎలాంటి చర్యలకైనా దిగుతారని విమర్శించారు.

Krishna Kumar N

Top Stories