హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బ్యాంకాక్‌కి ప్రధాని మోదీ... ఎందుకంటే...

జాతీయం11:46 AM November 02, 2019

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కి బయల్దేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సాయంత్రం ఆరు గంటలకు ఆయన... బ్యాంకాక్‌లోని భారతీయులను కలవనున్నారు. వారి సేవల వల్ల బ్యాంకాక్ ఎలా అభివృద్ధి చెందుతోందో వారితో ముచ్చటించనున్నారు. అలాగే... నవంబర్ 3న అక్కడ జరిగే 14వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గోనున్నారు. ఆ తర్వాత నవంబర్ 4న జరిగే... ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య దేశాల మూడో సదస్సు (RCEP)లో కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా... వివిధ దేశాల అధినేతలతో మోదీ భేటీ అవుతారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మోదీ పర్యటన సాగుతోంది. ఆసియా దేశాలతో కనెక్టివిటీ, కెపాసిటీ బిల్డింగ్, వాణిజ్యం, సంస్కృతుల మేళవింపుగా ఇది జరగనుంది. గతేడాది జనవరిలో ఢిల్లీలో ఆసియన్ దేశాల సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న పది దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. తాజా పర్యటనతో ఆయా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం, సముద్ర అంశాల్లో సహకారాన్ని పెంపొందించనున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading