HOME » VIDEOS » National

Modi Speech : త్వరలో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : ప్రధాని మోదీ

ఇండియా న్యూస్05:26 AM August 09, 2019

జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయని మోదీ అన్నారు. అప్పుడు ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది బాగా జరుగుతోందని మోదీ అన్నారు. అలాగే, మరికొన్ని రోజుల్లో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని మోదీ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టే అసెంబ్లీ ఎన్నికలు కూడా శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ ఎమ్మెల్యేను ఎన్నుకోవచ్చని, ముఖ్యమంత్రి కూడా ఉంటారని చెప్పారు.

Krishna Kumar N

Top Stories