హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భూటాన్‌లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన... విశేషాలు ఇవీ...

జాతీయం13:27 PM August 18, 2019

Narendra Modi Bhutan Tour : రెండ్రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉదయం 9.30కి భూటాన్ రాయల్ యూనివర్శిటీలో ప్రసంగించారు. తర్వాత 10.30కి నేషనల్ మెమరియల్ చార్టెన్‌ను సందర్శించారు. 11 గంటలకు ప్రతిపక్ష నేత డాక్టర్ పేమ గ్యామ్స్‌షోను కలిశారు. మధ్యాహ్నం 12 గంటలకు తాషీచ్చోడ్జోంగ్‌లోని క్యూన్రే దగ్గర భూటాన్ రాజు ఇచ్చే విందులో పాల్గొన్నారు. తొలిరోజు భూటాన్ పర్యటనలో మోదీ... భారత్ సాయంతో నిర్మించిన మాంగ్ డెచు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టును ప్రారంభించారు. భూటాన్ ప్రజలకు అంకితం చేశారు. 2020 కల్లా 10 వేల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో రూ.4,500 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని సామర్థ్యం 720 మెగావాట్లు. రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రధాని మోదీ భూటాన్‌లో వస్తువులు కొని ఆ దేశంలో రూపే కార్డును ప్రారంభించారు. సిమ్తోఖా డాంగ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భూటాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని... థింపూలో మొక్కలు నాటారు. ఆ తర్వాత భారత్‌ - భూటాన్‌ మధ్య హైడ్రో పవర్‌ సాయానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా రెండు దేశాల ప్రధానులూ కలిసి స్మారక స్టాంపుల్ని విడుదల చేశారు. అలాగే 9 ఒప్పందాలు కుదిరాయి.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading