HOME » VIDEOS » National » PM MODI NO LESSER THAN GOD SAYS SHIVRAJ SINGH CHOUHAN NK

Video : నువ్వు దేవుడివి సామీ... నరేంద్ర మోదీపై శివరాజ్ సింగ్ ప్రశంసలు

జాతీయం11:14 AM December 23, 2019

నేతలు యూ టర్న్‌ తీసుకోవడం సహజం. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ రూటే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, ఇంచుమించు ఆయన స్థాయి నేతలా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్... ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత... పూర్తిగా మెత్తబడ్డారు. ఇప్పుడు మోదీని ఆకాశానికెత్తేసే నేతల్లో ఆయనా చేరిపోయినట్లు కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చినందుకు ఆదివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని దేవుడితో పోల్చుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాకిస్థాన్‌లో వేధింపుల్ని ఎదుర్కొంటున్న ఎంతో మంది భారత్ వచ్చి తలెత్తుకునేలా, గౌరవంగా బతికేలా మోదీ చేస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. "దేవుడు మీకు ప్రాణం ఇచ్చాడు. తల్లి జన్మనిచ్చింది. కానీ నరేంద్ర మోదీ వాళ్లకు ప్రాణం పోశారు. గౌరవంగా జీవించేలా, తలెత్తుకునేలా చేశారు. నరేంద్రమోదీ... దేవుడి కంటే తక్కువేమీ కాదు. అంతే కదా. అని ఇండోర్‌లోని సింధి, పంజాబీ వర్గాలకు చెంందిన బీజేపీ కార్యకర్తలతో అన్నారు శివరాజ్ సింగ్ చౌహన్. ఆ సమయంలో ఆ వేదికపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఉన్నారు.

webtech_news18

Top Stories