హోమ్ » వీడియోలు » జాతీయం

కశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలను సభా ముఖంగా ఖండించిన మంత్రి జయశంకర్...

జాతీయం15:47 PM July 23, 2019

కశ్మీర్ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వంవహించాలని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం పార్లమెంటులో దుమారంరేపింది. ట్రంప్ వ్యాఖ్యలపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ప్రధాని మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో స్పష్టంచేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి సుస్పష్టమని, మూడో దేశం జోక్యాన్ని సహించబోమని స్పష్టంచేశారు. సిమ్లా ఒప్పందం మేరకు భారత్-పాక్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను ఇరు దేశాలు చర్చించి పరిష్కరించుకుంటాయని, మరో దేశం జోక్యం అవసరం లేదన్నారు.

webtech_news18