అమెరికాలోని హవాయిలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది.
ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా తృటిలో తప్పించుకున్నారు. కాల్పుల సమయంలో భదౌరియా బృందం కూడా అక్కడే ఉంది. అయితే కాల్పుల ఘటనలో ఐఏఎఫ్ టీమ్ ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.