పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ... ‘సభలో ప్రజా సమస్యలన్నింటిపై సమగ్ర చర్చ జరగాలి. ప్రజలందరూ మనల్ని నమ్మి... వారి సమస్యల గురించి మాట్లాడాలని ఇక్కడికి పంపించారు. కాబట్టి పార్లమెంటులో అన్ని సమస్యల గురించి మాట్లాడదాం... ప్రభుత్వ పనితీరు పొడుగుతారో, లేక తిడతారో ఏదో ఒకటి చర్చ మాత్రం జరగాలి...’ అన్నారు.