HOME » VIDEOS » National

బిహార్ పసి పిల్లల గోస..సరైన వైద్యం లేక తల్లడిల్లుతోన్న తల్లులు

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) బారిన పడి గత 20 రోజుల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 100కు పైన చేరింది.  పోయిన ఆదివారం ఒక్క రోజే 20 మందికి పైగా చిన్నారులు మరణించారు. అధికారిక సమాచారం మేరకు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 87 మంది చిన్నారులు మృతి చెందగా...కేజ్రివాల్ ఆస్పత్రిలో 17 మంది కన్నుమూశారు. చిన్నారుల మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో ఇంకా 300 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అది అలా ఉంటే..మరికొంత మంది తల్లులు..తమ పిల్లలు తీవ్రమైన జ్వరంతో గోసపడుతున్నారని..వైద్యం చేయాలని దవాఖానకు వెళ్తే..ఏవో మందులుచ్చి..అయిపోయింది వెళ్లమంటున్నారని వాపోతున్నారు. కొంతమందికి కనీసం ఓఆర్ఎస్ పాకెట్స్ కూడ అందుబాటులో లేవని బాధపడుతున్నారు..పిల్లల తల్లిదండ్రులు.

webtech_news18

Top Stories