న్యూఢిల్లీ: నాలుగు రోజుల పాటు సాగిన గణతంత్ర వేడుకలు బీటింగ్ రిట్రీట్ తో ఢిల్లీలో బుధవారంనాడు ఘనంగా ముగిసాయి. ఢిల్లీ లోని విజయ్ చౌక్ లో జరిగిన బీటింగ్ రిట్రీట్లో 14 మిలటరీ బాండ్స్...మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. త్రివిధ దళాలకు చెందిన సైనికులు దేశభక్తి గీతాలతో సాగించిన మార్చ్ఫాస్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరైన వెంటనే బీటింగ్ రిట్రీట్ మొదలైంది. త్రివిధ దళాల అధిపతులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వేలాది మంది ప్రజలు ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.