హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఘోర రోడ్డు ప్రమాదం... బస్సులో మంటలు... 20 మంది మృతి

జాతీయం11:30 AM January 11, 2020

ఉత్తరప్రదేశ్... కన్నౌజ్ జిల్లాలో జరిగిందో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఎదురెదురుగా బలంగా ఢీ కొన్నాయి. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో బస్సంతా వ్యాపించాయి. అవే మంటలు ట్రక్కుకు కూడా అంటున్నాయి. ఈ ప్రమాదంలో... బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు చనిపోగా... మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు... ఫరూఖాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్తోంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామం దగ్గర వేగంగా వెళ్తూ... ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఐతే... ప్రమాదానికి పొగమంచే కారణమని తెలుస్తోంది. మంచువల్ల ఎదురుగా ట్రక్ వస్తున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించలేకపోయి ఉండొచ్చని కొందరు అంటుంటే... ట్రక్‌కి ఫ్రంట్ హెడ్ లైట్లు వెలిగే ఉంటాయి కాబట్టి... డ్రైవర్ నిద్ర మత్తులో ఢీకొట్టి ఉంటారని కొందరు అంటున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

webtech_news18