కరోనా కారణంగా ఈ నెలాఖరు వరకు సినిమాహాళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పరీక్షలు నిర్వహించని స్కూళ్లు, కాలేజీలను కూడా మార్చి 31 వరకు మూసి వేసేందుకు నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.