మంగళవారం తెల్లవారుజామున కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఓ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి కుట్రతో ప్రమేయం ఉన్న సాజద్ అహ్మద్ భట్ కూడా ఉన్నాడు. బిజ్‌బెహారా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా జవాన్లు వారిని ఎన్‌కౌంటర్ చేశారు.