అటు అమ్మ. ఇటు కర్తవ్యం. రెండింటికీ సమన్యాయం చేసేందుకు ఆ తల్లిపడిన కష్టాన్ని అందరూ అభినందించకుండా ఉండలేకపోయారు. అసోంలోని ధరమ్‌తుల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శాంసల్ నేహార్కు ఎలక్షన్ డ్యూటీ వేశారు. దీంతో ఆమె తన తొమ్మిదేళ్ల బిడ్డతో కలసి ఎన్నికల విధులకు హాజరైంది.