హోమ్ » వీడియోలు » జాతీయం

Chennai Water Crisis : చెన్నైనీటి కష్టాలు.. రైల్‌లో నీటిని తరలిస్తున్న అధికారులు..

జాతీయం13:54 PM July 12, 2019

చెన్నైని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు లేకపోవడం.. చెరువులు,కుంటలు ఎండిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వాయర్లలోనూ చుక్క నీరు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వేరే ప్రాంతాల నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అందులో భాగంగా.. గురువారం జోలార్‌ పెట్టాయ్ నుంచి చెన్నైకి 50వేల లీటర్ల నీటిని రైలు ద్వారా తరలించారు. చెన్నైలో నీటి కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. కొన్నిచోట్ల స్కూళ్లు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. కొన్నిచోట్ల హోటల్స్ కూడా మూతపడ్డాయి.

webtech_news18