ఫొని తుఫాన్ దూసుకొస్తుండడంతో ఒడిశా వణికిపోతోంది. తూర్పు తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం మహోగ్రూపం దాల్చి అలల రూపంలో ఎగసిపడుతోంది. ఫొని తుఫాన్ నేపథ్యంలో ఒడిశా తీరంలోని అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 8 లక్షల మంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.