హోమ్ » వీడియోలు » జాతీయం

అవసరమైతే ముందు మనమే అణుబాంబు వేస్తాం... రాజ్‌నాథ్ సంచలనం

జాతీయం15:03 PM August 16, 2019

జమ్మూకాశ్మీర్ అంశంపై పాకిస్థాన్... జీహాద్ యుద్ధాన్ని ప్రకటించింది. అందుకు సన్నద్ధం కావాలని ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని, సైన్యానికి పిలుపిచ్చారు. పైగా యుద్ధం జరిగితే తీవ్ర నష్టం తప్పదనీ, అది ఎక్కడిదాకానైనా వెళ్లే ప్రమాదం ఉందని పరోక్షంగా అణ్వాయుధ యుద్ధం జరుగుతుంది అన్నట్లుగా డైలాగ్స్ పేల్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ పరిణామాలతో అలర్టైన భారత్ కూడా... అంతే ఘాటుగా తిప్పికొడుతోందా. ఇప్పటివరకూ భారత్... యుద్ధం వస్తే ముందుగా అణ్వాయుధ దాడిని చెయ్యదన్నది ఓ రూల్. అవసరమైతే ఈ విధానాన్ని భవిష్యత్తులో మార్చేసే అవకాశాలుంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. పోఖ్రాన్‌‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్య చేశారు. పరిస్థితులను బట్టీ ఏదైనా ఉంటుందన్నారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అన్న రాజ్‌నాథ్... ఇప్పటివరకూ ఆ విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని ట్వీట్ చేశారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్... ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.

webtech_news18