బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ లోని గాంధీనగర్ నియోజక వర్గంలో నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ సభ ర్యాలీకి ఎన్డీఏ నేతలంతా తరలివచ్చారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, రామ్‌విలాస్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే, అకాలీ దళ్ నుంచి బాదల్ ఈ నామినేషన్ ర్యాలీకి హాజరయ్యారు.