HOME » VIDEOS » National

Video : మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : శివసేన

ఇండియా న్యూస్14:35 PM November 23, 2019

Maharashtra Politics : శివసేన, ఎన్సీపీకి కలిపి మొత్తం 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్... కొంతమంది ఇండిపెండెంట్లు కూడా తమతో ఉన్నారన్నారు. రాత్రి జరిగిన పరిణామాలతో ఉదయమే పరిస్థితి మారిపోయిందన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌... మూడు పార్టీలకూ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందన్నారు శరద్ పవార్. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం లేదన్నారు. అజిత్ పవార్ నిర్ణయం... పార్టీ నిర్ణయానికి పూర్తి విరుద్ధమన్న శరద్ పవార్... అజిత్ పవార్... పార్టీ క్రమశిక్షణను తప్పారని అన్నారు. బీజేపీకి మద్దతు ఇచ్చే ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉందన్న ఆయన... అజిత్‌తో ఉన్న ఎమ్మెల్యేలంతా తమతోనూ టచ్‌లో ఉన్నారని అన్నారు. అజిత్ పవార్ నిర్ణయంతో పార్టీలో ఎవరూ సంతోషంగా లేరన్న శరద్ పవార్... ఎన్సీపీ ఎప్పటికీ బీజేపీతో కలవదని అన్నారు. అజిత్ వెంట మహా అయితే 10 నుంచీ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారని అన్నారు. బీజేపీ చేసిన సర్జికల్ స్ట్రైక్.. తమ పార్టీలపైనే కాక... మహారాష్ట్ర ప్రజలపైనా జరిగిందన్నారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. బీజేపీ అన్ని సిద్దాంతాల్నీ విస్మరించిందన్న ఆయన... పార్టీలను చీల్చి బీజేపీ అధికారం చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ కుట్ర బయటపడిందన్న ఆయన... అజిత్ పవార్‌తో వెళ్లిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి... ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసే ఉన్నాయన్నారు.

webtech_news18

Top Stories