హోమ్ » వీడియోలు » జాతీయం

Video: నదిలో పడవ బోల్తా.. బోటులో 30 మంది విద్యార్థులు

జాతీయం22:02 PM August 14, 2019

ఒడిశాలోని కాని నదిలో పడవ ప్రమాదం జరిగింది. కేంద్రపారా జిల్లా మధుబన్ ఘాట్ సమీపంలో పడవ బోల్తా పడింది. దాంతో పడవలో ఉన్న సుమారు 30 మంది విద్యార్థులు నదిలో పడిపోయారు. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని విద్యార్థులందరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. నది లోతు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. చాలా మంది విద్యార్థులు నీటిలో నుంచి నడుచుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చారు. నదిలో నీటిని మింగిన కొందరు విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

webtech_news18