రాజస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దుంగర్ పూర్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు 12మంది స్కూల్ పిల్లలతో వెళుతున్న ట్రక్కు వరదలో చిక్కుకుపోయింది. స్థానికులు సహాయక బృందాలు సకాలంలో స్పందించి పిల్లలను రక్షించడంతో పెనుప్రమాదం తప్పింది.