నదియా కొమానెసీ ప్రైజెస్ స్కూల్ విద్యార్థులు... వీధుల్లో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో ఇద్దరు విద్యార్థులు ఎంతో ఈజీగా జిమ్నా్స్టిక్స్ ఫీట్స్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని ట్విట్టర్లో 5 లక్షల మందికి పైగా చూసారు. రొమేనియా రిటైర్డ్ జిమ్నాస్ట్ నదియా కొమానెసీ కూడా ఈ వీడియో చూశారు. ఐదుసార్లు గోల్డ్ మెడల్ గెలిచిన ఆమె... ఆ విద్యార్థులను మెచ్చుకున్నారు. ఒలింపిక్స్‌లో పర్ఫెక్ట్ 10 మార్క్స్ తెచ్చుకున్న తొలి జిమ్నాస్ట్ ఆమె. ఈ వీడియోని నాగాలాండ్‌లో షూట్ చేసినట్లు తెలిసింది.