హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఇప్పటికీ అమ్మనే నాకు డబ్బులిస్తుంది : మోదీ

జాతీయం12:56 PM April 24, 2019

భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో ప్రత్యేక చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయ్ అడిగిన ప్రశ్నలకు మోదీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. నెలా నెలా మీ అమ్మకు మీరు డబ్బు పంపిస్తారా అన్న ప్రశ్నకు.. లేదని బదులిచ్చారు. అంతేకాదు, ఇప్పటికీ అమ్మనే తనకు డబ్బు ఇస్తుందన్నారు. ఎప్పుడు కలిసినా ఎంతో కొంత చేతిలో పెడుతుందని చెప్పారు. చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలిపెట్టడంతో.. కుటుంబ సభ్యులు ఎవరితోనూ అంతగా అనుబంధం లేదని చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఇప్పుడు ప్రధానిగా ఉన్నా.. తన కుటుంబం, బంధువుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు.

webtech_news18