Eid al-Adha : బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు దేశ వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పండుగ సందర్బంగా దేశంలోని వివిధ నగరాల్లోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. దీన్నే ఈద్ ఉల్ అధా అని కూడా అంటారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ మస్లీం సోదరులు ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ముస్లీం సోదరులందరూ తల స్నానాలు చేసి.. కొత్త వస్త్రాలు ధరిస్తారు. అంతేకాకుండా అత్తరు పూసుకొని మసీదులు, ఈద్గాలకు వెళ్తారు. అక్కడ ప్రత్యేక నమాజ్ చేస్తారు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ పండుగ సందర్బంగా కశ్మీర్లోని ముస్లీం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.