HOME » VIDEOS » National

Video : ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు... జనజీవనం అస్తవ్యస్తం

ఆర్థిక రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరంలోని కొన్ని చోట్ల అంధకారం అలముకుంది. ఆదివారం రాత్రంతా ముంబయి, శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రధాన రహదారులు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి డివిజన్‌లోని పాల్ఘర్‌ ప్రాంతంలో వర్షం కారణంగా ముంబయి-అహ్మదాబాద్‌ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను కూడా గంట పాటు ఆలస్యంగా నడిచింది. వరద ప్రవాహం ఎక్కువకావడంతో సియోన్‌ రైల్వేస్టేషన్‌-మతుంగ స్టేషన్‌ మధ్య పట్టాలపైకి నీరు చేరింది. జామ్రంగ్‌‌- ఠాకూర్వాడీ మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో వైపు నడిచే 10 రైళ్లను రద్దు చేశారు.

Krishna Kumar N

Top Stories