తీవ్ర చలి మనకే కాదు... జంతువులకూ సమస్యే. రుద్రప్రయాగ్‌లో చలిని తట్టుకోలేకపోయిన ఓ కోతి... సైలెంట్‌గా ఓ సాధువు కప్పుకునే దుప్పటిని ఎత్తుకెళ్లిపోయింది. దాన్ని కప్పుకోవడం రాక... రకరకాలుగా చిందులేసింది. అది చూసిన మరో కోతి... ఆ దుప్పటిని లాగేసేందుకు ప్రయత్నించింది. ఇలా కోతికి కొబ్బరి చిప్పే కాదు... దుప్పటి దొరికినా... నానా హంగామా చేస్తాయని అర్థమవుతోంది.