హోమ్ » వీడియోలు » జాతీయం

Video : క్రికెట్ గొడవ.. ముస్లిం కుటుంబంపై మూక దాడి

జాతీయం13:48 PM March 23, 2019

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఓ ముస్లిం కుటుంబంపై కొంతమంది మూక ఐరన్ రాడ్లు, హాకీ బ్యాట్లు, వాటర్ పైప్స్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారి ఇంటిపై రాళ్లు రువ్వారు. దాడిలో మొత్తం 40మంది వరకు పాల్గొనట్టు సమాచారం. గురుగ్రామ్‌లోని భోండ్సిలో ఉన్న భూప్‌సింగ్ నగర్‌లో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంత దాడి జరిగినా.. పోలీసులు మాత్రం ఘటనను కేవలం వాగ్వాదం మాత్రమే అని చెప్పడం గమనార్హం. హోలీ సందర్భంగా క్రికెట్ ఆడుతున్నవేళ.. ఈ వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబం మాత్రం ఇది కొంతమంది హిందుత్వ వాదులు చేసిన దాడి అని ఆరోపిస్తున్నారు.దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దాదాపు 10 మంది వ్యక్తులు సదరు ముస్లిం కుటుంబంపై దాడి చేయడం కనిపిస్తోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading