ఒకప్పుడు విదేశాల నుంచి పక్షులు ఎగురుకుంటూ మన దేశానికి వచ్చేవి. ఇక్కడ రెండు, మూడు నెలల పాటు సేద తీరి వెళ్లిపోయేవి. అయితే.. గత కొన్నేళ్లుగా వర్షాలు కురవకపోవడంతో వలస పక్షులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే.. ఈ సారి ఎక్కువగా వర్షాలు పడటంతో కర్ణాటకలోని గుడవి బర్డ్ సాంక్చుయరీ వలస పక్షులతో కిటకిటలాడుతోంది.