లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ... సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కలిశారు. అద్వానీ కాళ్లకు నమస్కరించిన నరేంద్ర మోదీ... ఆశీర్వాదం తీసుకున్నారు. ఎల్ కే అద్వానీని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు నరేంద్ర మోదీతోపాటూ... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. పార్టీ విజయంపై ఎల్ కే అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. అందరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. అద్వానీ పక్కనే కూర్చున్న మోదీ... పార్టీ ఏయే రాష్ట్రాల్లో ఎలా గెలిచిందీ, పోల్స్ ఫలితాలు ఎలా వచ్చిందీ పూర్తి వివరాలు చెప్పారు. అన్నింటినీ అద్వానీ ఎంతో ఆసక్తిగా విన్నారు. సంతృప్తి వ్యక్తం చేశారు. అద్వానీని కలిసిన తర్వాత నరేంద్ర మోదీ, అమిత్ షా... మరో పార్టీ సీనియర్ నేత... మురళీ మనోహర్ జోషీ ఇంటికి కూడా వెళ్లి... ఆయన్ని కలిశారు. పార్టీ సాధించిన ఓట్లు, NDA పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాలపై ఆయనతో మాట్లాడారు.