హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పళనిస్వామి డబ్బులు పంచారా... సోషల్ మీడియాలో దుమారం... ఇదీ వాస్తవం

జాతీయం16:59 PM April 22, 2019

Lok Sabha Election 2019 : తమిళనాడులో సీఎం పళనిస్వామి డబ్బులు పంచారనీ... మంగళవారం రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో... తిన్నగా ఓటర్లను కలిసి పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా ఇచ్చారని ట్విట్టర్‌లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. నిజానికి పళనిస్వామి డబ్బు పంచలేదు. కేవలం పార్టీ పాప్లెంట్ మాత్రమే ఇచ్చారు. ఓ పండ్ల షాపు దగ్గరకు వెళ్లిన పళనిస్వామి అక్కడి మహిళతో మాట్లాడారు. తమకే ఓటు వేయాలని కోరారు. సీఎం అంతటి నేత తన దగ్గరకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి వాటికి డబ్బులు ఇద్దామనుకుంటే ఆమె వద్దన్నారు. సరే అనుకున్న ఆయన... తమ పార్టీ పాంప్లెట్ ఇచ్చి... తమకే ఓటు వెయ్యమన్నారు. పళనిస్వామి చెప్పిన మాటకు ఆమె సరేనంది. ఆమె దగ్గర నుంచీ సెలవు తీసుకుంటూ... అరటిపండ్లకు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చారు పళనిస్వామి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. వాస్తవాల్ని వక్రీకరిస్తూ... సోషల్ మీడియాలో ఇలాంటి చాలా వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం కోరుతోంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading