Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా.. శ్రీనగర్-బుద్గాం పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొంత అలజడి ఏర్పడింది. ఓటర్లు, సెక్యూరిటీ పోర్సెస్ మధ్య కొన్ని భిన్నాభిప్రాయాల వల్ల..కొంత మంది లోకల్ యూత్‌తో కలిసి అక్కడ ఉన్న పోర్సెస్ పై రాళ్లు రువ్వారు. దీంతో రక్షణ దళాలు వారిపై భాష్పవాయువును ప్రయోగించి..సద్దుమణిగించాయి.