కుక్కను వేటాడుతూ వెళ్లిన చిరుత బావిలోపడ్డ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమనేర్లో చోటుచేసుకుంది. చిక్లి రాజ్పూర్ గ్రామంలో మంగళవారం నాడు చోటుచేసుకున్న ఓ ఘటన గ్రామం మొత్తాన్ని ఓ బావివద్దకు పరుగులు తీసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ఓ రైతు పెంపుడు కుక్క కనిపించకుండా పోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన రైతుకు ఓ మారుమూల ప్రాంతం నుంచి కుక్క అరుపులు వినపడ్డాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్లిన రైతు అది ఓ బావిలో పడిపోయిన విషయాన్ని గమనించాడు.