పశ్చిమ బెంగాల్లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. అక్కడి పురులియా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ రైలు ఎక్కబోయి జారిపడి.. ప్లాట్‌ఫాంకు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయింది. వెంటనే అక్కడున్న ప్రయాణికులు ఆమెను పైకి లాగి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.