నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రుల శాఖలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తనతో పాటు మరో 57 మందితో కేంద్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక, తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి అమిత్ షా టీమ్‌లో చేరారు. ఆయనకు హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు. అందులో భాగంగా కిషన్ రెడ్డి ఈరోజు హోంశాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలను స్వీకరించారు.