Kherki Daula toll plaza : టోల్ ఛార్జీలపై వాగ్వాదం అయి.. ఓ మహిళా ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు.. ఓ కారు డ్రైవర్. హర్యానా రాష్ట్రం లోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజాలో ఓ మహిళ తన ఉద్యోగంలో భాగంగా టోల్ ఫీజ్ వసూలు చేస్తుంది. అయితే ఏమైందో ఏమో ఈ మహిళ ఉద్యోగి, ఆ కారు డ్రైవర్ మధ్య కొంత వాగ్వాదం జరిగింది. దీంతో చిర్రెత్తిపోయిన కారు డ్రైవర్ ఆ మహిళ చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో ప్రస్తుతం వీడియో వైరల్గా మారింది.